కథలు రాయడం ఎలా 

ఎంతో మంది కథ రాయాలని అనుకున్న వాళ్ళు ... నన్ను అడుగుతున్న పురాతనమైన ప్రశ్న ఇది. నిజానికి కథలు ఎలా రాయాలో ఎవ్వరూ చెప్పలేరు.... బట్ కథలు రాసేటప్పుడు తాము తెలుసుకున్న విషయాలని చెప్పుకుంటే బాగానే ఉంటుంది. అందుకే కథా రచనలో నా అనుభవాలు కొన్ని పంచుకుంటే కొత్త రచయితలకు ఉపయోగపడుతుంది అని ఈ వ్యాసం రాస్తున్నాను.

 

కథలు రాయాలని నాకు ఎందుకు  అనిపించింది?

 

ఏదైనా సినిమా కథని చదువుతున్నప్పుడు, లేదా ఇప్పటి తరం గురించి కథలు చదువుతున్నప్పుడు ఎందుకు నేను ఇంతకన్నా బాగా రాయగలను కదా అనిపిస్తూ ఉండేది. కాస్తన్నా మన వాడుక భాషలో ఆ కథలు ఉండాలని అనుకున్నాను. అలా అనుకునే కథ రాయాలని నిశ్చయించుకున్నాను.... ఒక రకంగా చెప్పాలంటే నేను మొండి అనే కథ రాస్తా అని మొదట ప్రకటించినప్పుడు వందలాది మంది రాయక ముందే ఎంకరేజ్ చేశారు. అప్పటికి కథ రాయడం నాకు నిజంగానే రాదు.

 

మొదటి కథ :

 

మొండి లో మొదటి ఎపిసోడ్ రాసాక ఎందుకో నాకు ఇది చాలా కాలం పట్టేలా ఉంది .... కాబట్టి ఒక చిన్న కథని రాద్దాం అని ఫిక్స్ అయ్యాను... అప్పుడు రాసిన కథే అసిస్టెంట్ డైరెక్టర్ ! 

ఆ కథలో అసిస్టెంట్ డైరెక్టర్ ల జీవితంలో కష్టాలని , నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎదురైనా అనుభవాలని కలిపి ఒక కథగా , ట్రాజెడీ ఎండింగ్ తో ముగిస్తూ రాసాను. 

 

అంటే మొదటి సారి కథ రాసినప్పుడు - నాకే కాదు చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే ... ఒక పాత్ర తాలూకు అనుభవాలని , పదిలంగా నిక్షిప్తపర్చడానికి రాస్తూ ఉంటాం. ఈ మొదటి కథల్లో దాదాపుగా ఒకటే పాత్రని తీసుకుని , ఆ పాత్రకు ఎదురయ్యే అనుభవాలు , మనుషులని గురించి మెల్లగా చెబుతూ కథ సాగుతూ ఉంటుంది. అయితే అసిస్టెంట్ డైరెక్టర్ కథ మొత్తం డల్ గా , పాథోస్ తో నిండిన కథ కావడంతో , అంతగా ప్రజలకు చేరువ కాలేదు.

 

 రెండవ కథ :

రెండవ కథ రాస్తున్నప్పుడు , ఎవరికైనా వచ్చినట్టే నాకు కూడా కాస్త కనువిప్పు అయ్యి , కథని మరింత ఆసక్తిగా రాయాలని ఫిక్స్ అయ్యాను. ఈ సారి అమెరికాకు పెళ్లి సంబంధాలు కావాలనుకునే వాళ్ళ మీద కోపాన్ని ఒక కథగా మలిచి , ఒక పెళ్లి చూపుల సన్నివేశంతో కథని సాగించాను. కథ పూర్తయ్యే టప్పటికి మొత్తం ఒక సన్నివేశంలోనే అయిపొయింది. డైలాగులు బాగున్నాయని పేరు వచ్చింది.

 

తరువాత కథ :

సమాజం లో జరుగుతున్నా నరబలి ఆచారం, మీద ఒక కథ రాసాను.

 

ఈ కథలో మొదటి సారి పాత్రలు ఒకే సీన్ లో , ఒక ప్రాంతంలో జరిగిపోకుండా -  పలు చోట్ల తిరుగుతాయి. 

అలాగే ఒకే పాత్ర గురించి కాక , మిగతా పాత్రలు వాటి గురించి , వాటి యొక్క గతాన్ని గురించి చెప్పే వివరణలు ఇస్తూ కథని నడిపించాను. ఒకడు మాట్లాడినట్టు కాకుండా , ఇద్దరు వేరే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు పాత్రలుగా మారి మన ముందు మాట్లాడుతూ ఉంటారు.

 

ఈ కథ రాసేటప్పుడు మెల్లగా అర్ధం అయిన విషయం ఏంటంటే ....

కథలో మిగతా పాత్రలకు వెయిట్ పెంచుతూ పోవాలి , అంటే కథలో అన్ని పాత్రలకూ ఆత్మ ఉండాలి.

 

నాలుగవ కథ :

ఇది కూడా ఓపెన్ గా ఎండ్ చేసిన కథ 

కానీ తన తల్లి తాలూకు నోస్టాలజియా గురించి రాసిన కథ. ఇంట్లో అనుభవాలు ఎదురుకుంటున్న ఒక గృహిణి గురించిన చెప్తూ , తన తల్లి ఎలా చూసుకునేదో చెప్పే కథ .. కొంత పేరు వచ్చింది.

 

అర్ధరాత్రి రైల్వే స్టేషన్ :

ఈ కథలో రైల్వే వర్కర్స్ ఎంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారో , అలాగే రైల్వే స్టేషన్ లో దయ్యాలు , అలాగే విద్యార్థుల ఆత్మా హత్యలు గురించి చెప్పుకుంటూ వచ్చాను. అయితే వారి నిత్యా జీవితంలో , మాటలు చేష్టలు , అలవాట్లు చూపించగలిగాను కానీ , కథని అవసరమైనంత  పొడిగించ లేదు. సో తుస్ మంది. 

 

నేటి రౌడీ :

నా కథల్లో అత్యంత పిచ్చి కథ గా పేరొందిన కథ. ఒక రకంగా విద్యార్థులు ఎలా రౌడీలుగా మారతారో చెప్పిన కథ. ఈ కథలో లోపం ఏంటంటే , కథగా నడిపించిన తీరులో ఎక్కడా ఇంటరెస్ట్ పుట్టించలేదు. కథకుడికి ఎంత మంచి కథ చెప్పినా నెక్స్ట్ ఏమి జరగబోతోంది అనేది తెలియకపోతే , వెస్ట్.

 

సరే సరే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువ సేపు అవుతుంది కాబట్టి నెమ్మదిగా నేను ఎలా పరిణామ క్రమం చెందానో , వీటి నుండి ఏమి నేర్చుకున్నానో ఇప్పుడు చెప్తా 

 

- మొదట్లో , కేవలం ఒక పాత్ర తాలూకు అనుభవాలు గురించి చెప్తూ కథలు రాసాను 

- తరువాత ఒక ముఖ్య పాత్ర , కొన్ని మామూలు పాత్రలు తీసుకుని ఒక పాయింట్ మీద కథ రాసాను 

- తరువాత పైన చేసినది చేసి , సన్నివేశాలు పెంచుకుంటూ కథలు రాసాను. 

- ముఖ్యంగా చాలా మంది కథల్లో కథనం ఫ్లాట్ గా , లేదా మరీ ఖంగారుగా పరిగెత్తినట్టు ఉంటోంది . దానికి కారణం... సినిమాలో లాగే , మ్యూజిక్ లో లానే , కథ చదివేటప్పుడు పాఠకుడి మైండ్ నెమ్మదిగా ఆలోచించడానికి , స్పీడ్ గా చదవటానికి టైం స్పేస్ ఉంటుంది. అంటే కొన్ని సీన్స్ నెమ్మదిగా కదులుతాయి , కొన్ని సీన్స్ చక చకా స్పీడ్ గా వెళ్తాయి. కొన్ని సీన్స్ ఎక్కువ పేజీలు ఉన్నా కూడా , స్పీడ్ గా కదులుతాయి. పాఠకుడు చదివేటప్పుడు ఆ స్పీడ్ ని తెలియకుండా మైండ్ లో ఫీల్ అవుతాడు. అతని ఎమోషన్స్ తో ఆదుకోవడం ఖచ్చితంగా రచయితకు అవసరం 

- ఒక వ్యక్తితోనో ., ఒక టాపిక్ తోనే , ఒక సమస్య తోనో , ఒక వస్తువుతోనో , ఒక పాయింట్ మీద ఖచ్చితంగా పాఠకుడు ఓన్ చేసుకోవాలి. లేదంటే కథ కచ్చితంగా ఫెయిల్ అయినట్టే. దేనికి కనెక్ట్ అవ్వాలో నిర్ణయించే హక్కు రచయితకు ఉంటుంది. అతని రచన బట్టి చదివేవాళ్ళు ఆ ప్లాట్ కి కనెక్ట్ అవుతారు.

- పాత్రలన్నీ ఒకేలా ఉండటానికి కుదరదు. అందరూ ఒకేలా ఆలోచించరు కదా. ఎంత విషాదమైన కథ అయినా , అందులో చురుగ్గా ఆలోచించే పాత్ర ఒక్కటైనా ఉంటుంది చూడండి. ఎందుకంటే పాత్రల్లో కాంట్రాస్ట్ ఉంటేనే , కథలో రచయితని చూడటం మానేసి , తనని తాను చూసుకుంటాడు పాఠకుడు. 

- కొన్నాళ్ళురాయడం అలవాటు అయిన తరువాత. నువ్వు రాసిన కథల్లో - ఒకటి కాదు రెండు , మూడు పాత్రలు కూడా గుర్తుండి పోతాయి.  అలా చెయ్యగలిగే కొద్దీ నీలో మంచి రచయిత తయారవుతూ ఉంటాడు. 

- కథ ఎలా మొదలుపెట్టాలి అనేది ఎక్కువ ఆలోచించకు , బాగా నచ్చిన ఒక సన్నివేశం తో , లేదా ఆసక్తి కలిగించే ఏదైనా సంఘటన తో మొదలుపెడితే బాగుంటుంది. అలానే ఉండాలి అని రూల్ లేదనుకోండి 

 

నేను కథలు రాసేటప్పుడు ఇలా బిగినింగ్స్ ఆలోచించే వాడిని 

1. కొన్ని డైలాగ్స్ రాసుకుని , స్పీన్స్ రాసుకుని వాటికోసం కథ అల్లేవాడిని 

2. కొన్ని బలమైన పాత్రలు అనుకుని వాటి మధ్యన సన్నివేసాలు ఒకటి రెండు రాసి , వాటి లోంచి ఒకటి తీసుకుని మొదలుపెట్టేవాడిని 

3. కథ మొదలయ్యాక పరిచయాలు , ఒక వేళ కొత్త ప్రాంతం గురించి చెప్పేటప్పుడు కళ్ళకు కట్టినట్టు చెప్పడానికి ట్రై చేసేవాడిని. ప్రేక్షకుడికి రంగు , రుచి , వాసన కూడా అక్షరాలా ద్వారా ఫీల్ అయ్యేలా చెయ్యగలిగితే ఇంకా డెప్త్ లోకి వెళ్తాడు. 

4. ఒక పాయింట్ పట్టుకుని రాయడం నెమ్మదిగా అలవాటు అయ్యింది, ఆ పాయింట్ ని ఆసక్తిగా చెప్పాలంటే ఎక్కడ నుండి మొదలయితే బాగుంటుంది అని ఆలోచించే వాడిని 

5. అసలు కథ 20 లైన్స్ గా సీన్స్ లిస్ట్ రాసుకుని , ఏది ముందు పెడితే ఇంట్రస్టింగ్ గా కథలోపలి వెళ్ళాచ్చో చూసుకునే వాడిని 

6.బేసిక్ గా ఏ పాత్రకు ఆ పాత్ర ఆత్మతో ఉండాలి. అంతే కానీ , రైటర్ అన్ని పాత్రల్లో తానే ఉన్నట్టు కనిపించకూడదు. మన పైత్యం ఆ పాత్రల మీద పడకుండా చూసుకోవాలి.

 

కథకి ఎప్పుడూ మూడు మూల భాగాలు ఉంటాయి. ఎలాంటి స్క్రీన్ ప్లే రాసినా , కథలో ఈ మూడూ తెలియకుండా పాఠకుడు వెతుక్కుంటూ ఉంటాడు...

 

మొదలు - ఎవరున్నారు ఈ కథలో , అనేది అర్ధం కావాలి. ఎక్కడున్నామన్నది కాస్త అయినా అర్ధం కావాలి. కథలో వెళ్లే కొద్దీ , కొత్త పరిచయాలు, పాత్రలు మరీ ఎక్కువ కాకూడదు. అలాగే పాత్రల పరిస్థితుల పరిచయం స్పీడ్ గా అయిపోతున్నట్టు అనిపియ్యాలి కానీ , సాగదీయకూడదు. ముఖ్యంగా కథ దేని గురించి జరుగుతోంది. ఈ కథ ఇందుకోసం , ఏ లక్ష్యం కోసం వెళ్తుందో అనేది చదివేవాడికి అర్ధం కావాలి  

మధ్యం - కథలో మెయిన్ ఛాలెంజ్ ని ఎన్ని రకాలుగా అప్రోచ్ అవ్వాలో , దానికోసం జరిగే ప్రయత్నాలు , మధ్యలో ఎదురయ్యే సమస్యలు , పాత్రలు , ఛాలెంజిలు , లేదా జరిగే సంఘర్షణ అంతా మధ్య భాగంలో నడుస్తుంది. ఎక్కువ మంది మామూలు కథకులకైనా , సినిమా రచయితలైనా దెబ్బ తినేది ఈ రెండవ భాగం తేడా కొట్టినప్పుడే. ముఖ్యంగా ఇక్కడ కథ వేగాన్ని , అవసరమైనప్పుడు పెంచుతూ , తగ్గిస్తూ పోవడం ఉత్తమమైన పద్దతి  

అంతం - కథని చివరగా ఎలా కంక్లూడ్ చేస్తావ్ అనేది అత్యంత కీలకమైన భాగం. కథ మొత్తం ఎలా ఉన్నా... చివరి కొచ్చే టప్పటికి ప్రేక్షకుడికి ఒక రకమైన పట్టు రావాలి. కథలోని పాత్రలతో కొంత సమయం (లేదా చాలా సమయం) అతను ప్రయాణం చేసి ఉంటాడు. అలంటి ఒక కథకి అంతం ఎప్పుడూ ఆసక్తికరంగా , లేదా ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఒక రకమైన ట్విస్ట్ తో రక్తికట్టాలి. ఎంత బాగా రాసినా చివరికి వచ్చేటప్పటికి ఒక రకమైన అలసట , బద్దకంతో కథని డల్ గా ఎండ్ చేసే ఒక యాటిట్యూడ్ వస్తూ ఉంటుంది రైటర్స్ కి . బ్రేక్ తీసుకుని అన్నా , ఎండ్ పార్ట్ బాగా వచ్చేలా చూసుకోవాలి...

ఒక్కోసారి విషాదాంతం , లేదా సుఖాంతం , లేదా ఒక ట్విస్ట్ తో ఎండ్ చెయ్యడం అనేది రెగ్యులర్ అలవాటు.

 

మళ్ళీ చెప్తున్నా 

ఎన్ని రకాల ట్విస్టులు, స్క్రీన్ ప్లే లు , వెరైటీ లూప్స్ రాసుకున్నా , కథలో ఈ మూడూ వెతకడం ప్రేక్షకుడికి అలవాటు. సైలెంట్ గా ఇవి కథలో భాగం అవ్వాలి.

 

 

అదన్న మాట సంగతి 

 

-కళ్ళకు కట్టినట్టు రాయొచ్చు 

- కవితాత్మకంగా రాయొచ్చు 

- ఆదర్శవాదంతో రాయొచ్చు 

- అనుభూతి ప్రధానంగా రాయొచ్చు 

- సెటైరికల్ గా రాయొచ్చు 

- థ్రిల్లింగ్ గా రాయొచ్చు 

- విషాదాన్ని చూపించడానికి రాయొచ్చు 

- ఒక అంశాన్ని కొత్త కోణంలో చూపించడానికి రాయొక్కుచు 

- భయపెట్టడానికి రాయొచ్చు 

- లైఫ్ లో కన్న కళలు గురించి రాయొచ్చు 

 

రాయొచ్చు ఎలా గైనా కథలు రాయచ్చు అండి బాబు....

Please Note

© 2023 by I Made It!. Proudly created with wix.com